భారత్ న్యూస్ నెల్లూరు..పోలీసుల అదుపులో తంబళ్లపల్లె టిడిపి మాజీ ఇన్‌ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి…?
ములకలచెరువు కల్తీ మద్యం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
బుధవారం జయచంద్రారెడ్డి ఆడిటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

A17 గా ఉన్న జయచంద్రారెడ్డిని పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన జయచంద్రారెడ్డి పట్టుబడటంతో సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.
గురువారం తంబళ్లపల్లె కోర్టులో జయచంద్రారెడ్డిని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
జయచంద్రారెడ్డి అరెస్ట్ చేశారనే ప్రచారంతో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆయన వ్యతిరేక వర్గం జోరుగా సంబరాలు చేస్తున్నారు.