ఏపీకి 8 మంది ఐఏఎస్ అధికారుల కేటాయింపు,

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీకి 8 మంది ఐఏఎస్ అధికారుల కేటాయింపు

కేంద్ర ప్రభుత్వం 2024 బ్యాచ్ కు ఎంపికయిన 179 మంది ఐఏఎస్ అధికారుల్లో 8 మందిని ఆంధ్రప్రదేశ్ కి కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లేఖ రాసింది. రాష్ట్రకేడర్ కు కేటాయించినవారిలో బన్నా వెంకటేష్, ఏఆర్ పవన్ తేజ (ఆంధ్రప్రదేశ్), కె.ఆదిత్యశర్మ, చింతకింది శ్రవణ్కుమార్ రెడ్డి (తెలంగాణ), హరిఓం పాండియా (రాజస్థాన్), నమ్రతా అగర్వాల్ (హరియాణా), ప్రియ (దిల్లీ), సుయష్ కుమార్ (ఉత్త రప్రదేశ్)లు ఉన్నారు. ఏపీ స్వరాష్ట్రంగా ఉన్న చెన్నంరెడ్డి శివగణేష్రెడ్డిని ఏజీఎంయూటీ, పి.సురేష్ను తెలంగాణ కేడర్కు కేటాయించారు.