భారత్ న్యూస్ గుంటూరు….శ్రీకాకుళం జిల్లా పోలీసు.
ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్ట్.
సుమారు 1.71 లక్షల విలువైన కేసు ప్రాపర్టీ స్వాధీనం.
చోరీ అయిన వెండి, ఇత్తడి,రాగి, కంచు సామాన్లతో పాటు నగదు రికవరీ.
శ్రీకాకుళం, డిసెంబరు 04. జిల్లాలో పలు
ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 1 లక్ష 71 వేల 200 రూపాయలు విలువైన చోరీ అయిన వెండి, ఇత్తడి, రాగి, కంచు సామాన్లతో పాటు నగదు రికవరీ చేసినట్లు గురువారం శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను డిఎస్పీ వివేకానంద వెల్లడించారు.
పిర్యాది వివరాలు చింతపల్లి గోపాల కృష్ణమూర్తి, S/o లేట్ జంగయ్య, వయస్సు 53 సంవత్సరాలు, వాడబలిజ కులం, పెద్ద గానగల్లవాని పేట గ్రామం, శ్రీకాకుళం మండలం & జిల్లా వారు 26.07.2025 ఉదయం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇచ్చారు.25/26.07.2025 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తమ గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో తాళాలు పగలగొట్టి వెండి కిరీటాలు, వెండి అడుగులు,వెండి దీపపు కుడ్డు,వెండి గంటా,
నగదు దొంగిలించారని రిపోర్ట్ అందించారు.
అరెస్టు కాబడిన ముద్దాయి వివరాలు:
A-1: ఎరుపల్లి అశోక్, S/o తాతారావు, వయస్సు 20, వాడబలిజ, జాలారిపేట గ్రామం, కల్లేపల్లి పంచాయతీ, శ్రీకాకుళం మండలం.
A-2: చోడిపల్లి వంశి, S/o అప్పారావు, వయస్సు 20, వాడబలిజ, బలరాంపురం గ్రామం, గార మండలం.
A-3: బెండి శివ ప్రకాష్, S/o చంద్రరావు, వయస్సు 22, కాలింగ, తోటాడ గ్రామం, ఆముదాలవలస మండలం.
నేరస్థుల నేర ప్రవృత్తి:
ముగ్గురు ముద్దాయిలు గతంలో ఆముదాలవలస పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్‌సైకిల్ దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి, 45 రోజులు జైలు శిక్ష అనుభవించారు.అనంతరం చెడు వ్యసనాలకు లోనై, రాత్రి సమయంలో దేవాలయాలు & ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేయడం ప్రారంభించారు.
నేరస్థులు చేసిన దొంగతనాలు నమోదు కాబడిన ప్రాంతాలు:
శ్రీకాకుళం రూరల్: సింగుపురం,పెద్ద గహనగలవాని పేట, కనుగులవానిపేట
గారలో కె. సవిరగం, కళింగపట్నం,అచ్చెనపాలెం
శ్రీకాకుళం 1 టౌన్, నందిగాంలో నరేంద్రపురం
మొత్తం సుమారు 15 కేసులలో వీరిపై ఆలయల్లో దొంగతనలు,ద్విచక్ర వాహనాలు దొంగతనలు కేసులు నమోదయ్యాయి.
అరెస్ట్ & రికవరీ వివరాలు:
తేదీ 03.12.2025 మధ్యాహ్నం 15:00 గంటలకు, శ్రీకాకుళం రూరల్ ఎస్సై గారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారంపై:
HC-1417, PCs-357, 1246, 2161, 2191 సిబ్బంది సహాయంతో అంపోలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి (NH-16) వద్ద ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు.
విచారణలో:08 కేసుల్లో (శ్రీకాకుళం రూరల్–03, గార–03, 1టౌన్–01, నందిగాం–01) వీరే నిందితులని అంగీకరించారు.
రాత్రిపూట తాళాలు పగులగొట్టి దేవాలయాలలోని
వెండి, ఇత్తడి, రాగి, కంచు సామాన్లు & నగదు దొంగిలించినట్లు వెల్లడించారు.
మొత్తం దొంగతన సొమ్ము శ్రీకాకుళం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు ప్రతిభకు అభినందనలు: కేసులను చేదించడంలో చాకచక్యంగా వ్యవహరించి, ప్రతిభ కనబరిచిన అదనపు ఎస్పీ శ్రీ పి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్‌డిపిఒ శ్రీ సిహెచ్. వివేకానంద మార్గదర్శకత్వంలో
రూరల్ సర్కిల్ సిఐ కె. పైడపునాయుడు
రూరల్ ఎస్సై కే. రాము సిబ్బంది జగదీశ్, రవి, బాబురావు ను జిల్లా ఎస్సీ శ్రీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, ఐపీఎస్ వారు ప్రత్యేకంగా అభినందించారు: