భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి:డిసెంబర్ 05
ఏపీ రాజధానిగా అమరా వతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది, ఏపీ రాజధాని చట్టంలోని సెక్షన్ 5(2) సవరణకు కేంద్రం చర్యలు చేపట్టింది, ఈ సవరణకు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం కూడా తెలిపింది, త్వరలో జరగబోతున్న మంత్రివర్గ ఆమోదం తర్వాత సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది కేంద్రం. పార్లమెంటు ఆమోదం తర్వాత అమరావతినే కొత్త రాజధానిగా ప్రకటిస్తూ గెజి ట్ విడుదల చేయనుంది….

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈ మేరకు బిల్లును సిద్ధం చేస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టిఆమోదింపజేసే అవకాశం ఉంది. అనంతరం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫి కేషన్ విడుదల చేసేందుకు కేంద్ర శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. .
ఆంధ్రప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయానికి ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే కేబినెట్ దృష్టికి సైతం ఈ చట్టబద్దత బిల్లు వెళ్లనుంది. ఆ తర్వాత దానిని పార్ల మెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నా లు ముమ్మరం చేసింది.
పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రరాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది.గత కొన్నాళ్లుగా అమరావతి రాజధానికి చట్ట బద్ధత కల్పించాలని ఏపీలో డిమాండ్ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప జేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన చట్టంలో ఏముంది? పార్ట్-2 కింద 5(1): నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. పార్ట్-2 కింద 5(2):సబ్ సెక్షన్ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగు తుంది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది.