భారత్ న్యూస్ గుంటూరు….ఐటీలో పని చేసేవారికి హెచ్ఐవీ సంక్రమణ శాతం పెరుగుతోంది!…జాతీయ ఎయిడ్స్ నియం త్రణ సంస్థ (న్యాకో)
సాంకేతికతలతో ఆధునిక పోకడలకు చిరు నామా అయిన ఐటీ రంగంలో హెచ్ఐవీ ప్రవేశించడం సంచలనం రేపుతోంది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందినవారిలో హెచ్ఐవీ సంక్రమణ శాతం పెరుగుతోందని ‘జాతీయ ఎయిడ్స్ నియం త్రణ సంస్థ (న్యాకో)’ తాజాగా హెచ్చరించింది.
అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని.. ఈ రంగాకి సంబంధించి హెచ్ఐవీ పరీక్షల సంఖ్యను పెంచాలని పేర్కొంది.
మొత్తంగా హెచ్ఐవీ వ్యాప్తి తగ్గినా.. ఐటీ రంగంతోపాటు వ్యవసాయ కూలీల్లో మాత్రం స్వల్పంగా పెరుగుతోందని వెల్లడించింది.
