పల్నాడు జిల్లా,నరసరావుపేటలో హిజ్రాల మధ్య వివాదం

భారత్ న్యూస్ రాజమండ్రి…పల్నాడు జిల్లా,నరసరావుపేటలో హిజ్రాల మధ్య వివాదం

వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హిజ్రాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని స్థానిక హిజ్రాల ఆరోపణ.

SRKT కాలని వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన స్థానిక హిజ్రాలు

హిజ్రాల సంఘం అధ్యక్షుడు చాందిని నాయక్ మాట్లాడుతూ…..

మేము గత పది సంవత్సరాలుగా నరసరావుపేటలోనే నివసిస్తున్నాం.

నరసరావుపేటలోనే భిక్షాటన చేసి జీవనం కొనసాగిస్తున్నాము

ఇటీవల తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు హిజ్రాలు షాపుల దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతూ మా పొట్ట కొడుతున్నారు

అనధికార హిజ్రాలు ఇబ్బంది పెడుతున్నారని కొందరు షాపు యజమానులు మాకు చెప్పారు.

ప్రజలు కూడా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

ఈ విషయంపై పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.