కోడూరులో ప్రజా దర్బార్,,

భారత్ న్యూస్ రాజమండ్రి…కోడూరులో ప్రజా దర్బార్!

కోడూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజా దర్బార్ రేపు కోడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సుధా ప్రవీణ్ తెలిపారు.

గురువారం మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు విచ్చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.

కోడూరు మండల ప్రజలు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కోరారు.