లోక్‌సభ పలుమార్లు వాయిదా… రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్‌,,

భారత్ న్యూస్ ఢిల్లీ…..అట్టుడికిన ఉభయ సభలు
లోక్‌సభ పలుమార్లు వాయిదా… రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్‌
పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్షాల ఆందోళన
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో రెండో రోజు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) అంశం ఉభయ సభల్ని కుదిపేసింది. ఎస్ఐఆర్‌పై చర్చకు అధికార పక్షం ముందుకు రాకపోవడంతో ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా అమలు చేస్తున్న ఎస్ఐఆర్‌ ప్రక్రియపై చర్చకు డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు చేసిన ఆందోళనతో వరుసగా రెండో రోజు కూడా లోక్‌సభకు అంతరాయం కలిగింది. రాజ్యసభలో కూడా అనేకసార్లు కార్యకలాపాలు అంతరాయం కలిగింది. హడావిడిగా ఎస్ఐఆర్‌ ప్రక్రియ చేపట్టడంపై అత్యవసరంగా చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనివల్ల అనేక రాష్ట్రాల్లో ఒత్తిడితో అనేకమంది బిఎల్‌వోలు ఆత్మహత్య చేసుకున్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ తర్వాతే ఎస్ఐఆర్‌ అంశాన్ని పరిగణించవచ్చని మోడీ ప్రభుత్వం మొండిపట్టుదలతో ఉంది. ఇప్పటికే కుదించిన శీతాకాల సమావేశాలను ఎటువంటి గందరగోళం లేకుండా శాంతియుతంగా నిర్వహించడంలో తమకు ఆసక్తి లేనట్టుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది. శీతాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎస్ఐఆర్‌తో సహా ఏదైనా అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమావేశాల మొదటి రెండు రోజుల్లో ప్రతిపక్షాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా సభకు అంతరాయం కలగడానికి కారణమైంది.

మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే, స్పీకర్‌ ఓం బిర్లా జార్జియన్‌ పార్లమెంట్‌ అధ్యక్షులు షల్వా పాపువాష్విలీ నేతృత్వంలోని జార్జియా పార్లమెంట్‌ బృందానికి స్వాగతం పలికారు. ప్రతినిధి బృందం పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందన్నారు. ఎస్ఐఆర్‌ అంశంపై చర్చకు ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడంతో.. 16 నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభంకాగానే… కాంగ్రెస్‌, డిఎంకె, సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, ఎస్‌పి, టిఎంసి తదితర ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఎస్ఐఆర్‌పై చర్చకు డిమాండ్‌ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రతిపక్ష ఎంపిలను కోరారు. ‘ఓట్‌ చోరీ, గద్ది చోరీ’ అంటూ సభ్యులు నినాదాలు హోరెత్తించారు. దీంతో తొమ్మిది నిమిషాల్లోనే మధ్యాహ్నం 2 గంటలకు సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైనా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభ నుంచి వాకౌట్‌

అతి ముఖ్యమైన ఎస్ఐఆర్‌పై చర్చ జరగాలని రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి