శ్రీలంకలో వరదలు.. బస్సు డ్రైవర్ నిర్వాకం చూడండి!

భారత్ న్యూస్ విశాఖపట్నం..శ్రీలంకలో వరదలు.. బస్సు డ్రైవర్ నిర్వాకం చూడండి!

శ్రీలంకలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. డ్యాములు నిండిపోయి పొంగిపోర్లడంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా ఆ దేశంలోని కందలముల్ల అనే ప్రాంతంలో ఓ డ్రైవర్ ప్రమాదకరంగా బస్సును నడిపాడు. బిడ్జిపై నుంచి భారీగా నీరు పారుతున్నా లెక్కచేయకుండా డ్రైవ్ చేసిన వీడియో వైరల్ అయింది. ఏ మాత్రం బస్సు అదుపుతప్పినా పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవని నెటిజన్లు డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

❄️ నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.