భారత్ న్యూస్ ఢిల్లీ…..…..రాష్ట్రపతి బాడీగార్డ్స్ గుర్రాలపై స్పెషల్ వీడియో రిలీజ్..
ప్రెసిడెంట్ బాడీగార్డ్ రెజిమెంట్ ఇండియన్ ఆర్మీలోనే అత్యంత పురాతనమైనది. ఇందులో ఉండే గుర్రాలు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. దేశంలోనే అత్యంత శ్రేష్ఠమైన గుర్రాలనే ఈ రెజిమెంట్ కు ఎంపిక చేస్తారు. గంటల కొద్దీ ట్రైనింగ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ది బెస్ట్ వాటిని సిద్ధం చేస్తారు. బాడీగార్డ్స్, గుర్రాల మధ్య బాండింగ్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అదే విషయాన్ని చెబుతూ రాష్ట్రపతి భవన్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.
