మీరు మీ ఆధార్ కార్డులో Name, డేట్ ఆఫ్ బర్త్ మరియు అడ్రస్ తదితర వివరాలను అప్డేట్ చేసి ఉంటారు

భారత్ న్యూస్ విజయవాడ…మీరు మీ ఆధార్ కార్డులో Name, డేట్ ఆఫ్ బర్త్ మరియు అడ్రస్ తదితర వివరాలను అప్డేట్ చేసి ఉంటారు.కానీ ఆ వివరాలు ప్రభుత్వం యొక్క GSWS డేటా బేస్ లో మారవు..

మీరు మీ యొక్క ఆధార్ లో అప్డేట్/కరెక్షన్ చేసుకున్న వివరాలు ప్రభుత్వం యొక్క డేటా బేస్ లో కూడా మారితేనే మీకు సచివాలయం ద్వారా తీసుకునే Caste,Income అలాగే వివిధ సంక్షేమ పథకాల జాబితాలో ఉండగలరు.

ఆధార్ లో మార్చుకున్న వివరాలు ప్రభుత్వం యొక్క డేటా బేస్/ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అప్డేట్ అవ్వాలి అంటే మీరు తప్పనిసరిగా EKYC చేసుకోవాలి.

వాస్తవానికి EKYC కోసం సచివాలయం వచ్చి మీరు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది.

కానీ ఇప్పుడు మీ యొక్క ఆధార్ లింక్ అయిన మొబైల్ OTP ద్వారా మీరే ఈ క్రింది లింక్ లో EKYC పూర్తి చేసుకోవచ్చు.

https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc

ముందుగా ఈ లింక్ లో ఆధార్ నెంబర్ మరియు Captcha కోడ్ ఎంటర్ చేయండి.ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ను ఎంటర్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి..EKYC పూర్తి అయినట్టే..eKYC పూర్తి అయిన 24 గంటల తర్వాత మీ ఆధార్ వివరాలు GSWS డేటా బేస్ లో అప్డేట్ అవుతాయి.

🟣గమనిక:

ఆధార్ కలిగిన మీ కుటుంబ సభ్యుల అందరికీ ఈ లింక్ ద్వారా ఒకసారి EKYC పూర్తి చేసుకుని మీ యొక్క ఆధార్ వివరాలను ప్రభుత్వం యొక్క డేటా బేస్ లో అప్డేట్ అయ్యేలా చేసుకోండి.ముఖ్యంగా చిన్న పిల్లలకి పూర్తి చేసుకోండి

అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం..