భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో కొత్త పురుగు వ్యాధి కలకలం

Ammiraju Udaya Shankar.sharma News Editor…స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టడంతో అనారోగ్యానికి గురయ్యి విజయనగరం ప్రాంతానికి చెందిన మహిళ మృతి
ఏపీలో 1317 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి(36) అనే మహిళ, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, స్క్రబ్ టైఫస్ సోకిందని నిర్ధారించిన వైద్యులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిన రాజేశ్వరి
ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి రాష్ట్రంలో అన్ని జిల్లాలో వ్యాపిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు
చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్సార్ కడపలో 94, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు తెలిపిన వైద్య శాఖ

వ్యాధి నిర్ధారణ జరిగితే సాధారణ యాంటిబయాటిక్స్ తో ఈ వ్యాధి నయం అవుతుందని, అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్న అధికారులు