రోగులను పరిక్షిస్తున్న మంగళగిరి ఎయిమ్స్” వార్త పై స్పందించిన ఎంపి బాలశౌరి

భారత్ న్యూస్ విజయవాడ…: “రోగులను పరిక్షిస్తున్న మంగళగిరి ఎయిమ్స్” వార్త పై స్పందించిన ఎంపి బాలశౌరి


Ammiraju Udaya Shankar.sharma News Editor…రోగులను పరిక్షిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ శిర్షిక తో ఆంధ్ర జ్యోతిలో వెలువడిన కధనం పై మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు మరియు ఎయిమ్స్ కమిటి సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి స్పందించారు. వెంటనే మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీ శాంతా సింగ్ తో పత్రిక లో వచ్చిన విషయాలపై మాట్లాడారు.
ఈ విషయమై ఎయిమ్స్ డైరెక్టర్ పత్రికలో పేర్కొన్న విషయాలు సరైనవి కావని, రక్త పరీక్షలు అదే రోజు అన్ని నమూనాలను పరిక్షలు చేస్తున్నామని, రక్తానికి సంబంధించి కల్చర్ నివేదికలు ప్రయోగశాలలో పెరగడానికి ప్రోటోకాల్ ప్రకారం 5-7 రోజులు సమయం పడుతుందని, ఎక్స్ రే రోగులు వచ్చిన రోజే సాయంత్రం లోపు పరిక్షలు చేసి పంపుతున్నామని తెలియచేశారు. MRI కి సంబంధించి 3 టెస్లా మరియు 1 CT ని పూర్తి సమయం రోగులకు అందుబాటులో ఉంచుతున్నామని, CT MRI 24 గంటలు వెయిటింగ్ పీరియడ్ లేదని మరియు 48 గంటల్లోనే నివేదికలు అందచేస్తున్నామని ఎంపి బాలశౌరి కి వివరించారు.
ఫార్మసీలో క్యూ లైన్ లో వెయిటింగ్ ఎక్కువగా గా ఉందని, త్వరలో అమృత్ ఫార్మసీ ద్వారా అదనపు కౌంటర్లను తెరవాలని ప్రణాళికలు తాయారు చేస్తున్నామని, ప్రస్తుతం ఎయిమ్స్ లో సర్జికల్ గ్యాస్ట్రో విభాగం లేనందున, జనరల్ సర్జరీ డిపార్ట్‌మెంట్ వారే వారి రెగ్యులర్ దినచర్యకు అదనంగా ఎండోస్కోపీ పనిని కూడా చేస్తున్నారని, అందుకనే ఎండోస్కోపీ – 1 వారం వెయిటింగ్ పీరియడ్ లో ఉందని వివరించారు.
అలాగే మంగళగిరి ఎయిమ్స్ లో ప్రతి విభాగానికి అనగా పేషెంట్ రిజిస్ట్రేషన్, అడ్మిషన్ బిల్లింగ్, ఫార్మసీ, రక్త నమూనాలు, రేడియాలజీ, డిశ్చార్జ్, అత్యవసర అన్ని ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయని, తగినంత మరియు అవసరమైన బిల్లింగ్ కౌంటర్లు ఉన్నాయని, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుండి చాల ఎక్కువ స్థాయిలో రోగులు వస్తున్నారని, అందువలన కొంత సమయం వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు.
ఈ విషయమై ఎంపి బాలశౌరి ఎయిమ్స్ డైరెక్టర్ మరియు సిబ్బంది కి అంకిత భావంతో రోగులకు సేవ చేయాలనీ, ఏమైనా ఇబ్బందులు ఉంటె తన దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఎంపి కార్యాలయం
మచిలీపట్నం,
..