భారత్ న్యూస్ ఢిల్లీ…..VIRAL: తుపాకీతో మహిళ డాన్స్
బిహార్లో ఓ మహిళ తుపాకీతో డాన్స్ చేసిన వీడియో SMలో వైరల్ అవుతోంది. వెస్ట్ చంపారన్ జిల్లాలో ఈ ఘటన జరగగా.. ముగ్గురిపై FIR నమోదైంది. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉండటం గమనార్హం. రాంపూర్ బయరాగీ గ్రామంలోని ఓ వేడుకకు కానిస్టేబుళ్లు అమిత్ చౌదరీ, అన్మోల్ తివారీ హాజరైనట్లు గుర్తించారు. దీంతో ఆ తుపాకీ ప్రభుత్వానికి చెందినదిగా భావిస్తున్నారు. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు….
