మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటిలో దొంగతనం చేసి పరారీలో వున్న ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు

భారత్ న్యూస్ గుంటూరు….గుంటూరు

మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటిలో దొంగతనం చేసి పరారీలో వున్న ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు

ఎస్పీ వకుల్ జిందాలు కామెంట్స్

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఈ నెల 3/11/205 తేదీ నాడు ఇంటి తాళం పగలకొట్టి దొంగతనం జరిగింది…

ఇంటి యజమాని హనుమంతరావు ఇచ్చిన పిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు విచారణ చేపట్టారు…

దర్యాప్తులో పల్సర్ బండి పై ముగ్గురు దొంగలు వచ్చి దొంగతనానికి పాల్పడినట్టుగా గుర్తించారూ…

నిందితులు
1)రాంబాబు…విజయవాడ
2)వెంకటేష్…చిలకలూరి పేట
3)విజయ్…చిలకలూరి పేట
ప్రాంతాలకు చెందిన వారు…

నిందితులు పై గతంలో దొంగతనాలు కేసులలో నిందితులుగా ఉన్నారు ఇద్దరి పై రౌడీ షీట్లు ఉన్నాయి…

వీరి వద్ద నుండి బంగారం మరియు వెండి ఆభరణాలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం…

నిందితులు ముగ్గురు లాడ్జి లో ఉంటూ దొంగతనాలు చేసే ప్రాంతాలను ఎంచుకొని రెక్కీ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు…

ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నారు…