భారత్ న్యూస్ విశాఖపట్నం..దిత్వా తుపాను ఎఫెక్ట్.. తమిళనాడుకు విమానాల రద్దు.. విద్యా సంస్థలకు సెలవులు
బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన ‘దిత్వా’ తుపాను
తమిళనాడు-పుదుచ్చేరి తీరం వైపు వేగంగా కదులుతున్న వైనం
ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన తమిళనాడు ప్రభుత్వం
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం ‘దిత్వా’ తుపాను వాయవ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతూ, ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రేపు ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని కారణంగా తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం
ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా తీవ్రంగా ఉండనుంది. రాబోయే 48 గంటల పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రేపు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా కుండపోత వర్షాలు (20 సెం.మీ. కంట