భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా పోలీస్
“పూర్తి సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలకు ఉపక్రమిస్తాం” – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న హోంగార్డ్ సెల్ఫీ వీడియోపై సమగ్ర విచారణ జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు తెలిపారు.
విధి నిర్వహణలో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, సహ ఉద్యోగుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ హోంగార్డ్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించిన ఆవేదనాత్మక వీడియోను గమనించిన వెంటనే, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని అధికారులు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

విచారణ నివేదిక అందిన వెంటనే తగిన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు స్పష్టం చేశారు.