అనంతపురం టౌన్, సాయి నగర్ 3rd క్రాస్ లో గల శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై దాడి చేసి ధ్వంసం చేసిన అడ్వకేట్ మొగలి సత్యనారాయణ రెడ్డి మరియు అతని అనుచరులు ఆరు మంది అరెస్ట్ ,

భారత్ న్యూస్ అనంతపురం…అనంతపురం టౌన్, సాయి నగర్ 3rd క్రాస్ లో గల శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై దాడి చేసి ధ్వంసం చేసిన అడ్వకేట్ మొగలి సత్యనారాయణ రెడ్డి మరియు అతని అనుచరులు ఆరు మంది అరెస్ట్ ,

*నేరానికి ఉపయోగించిన 3 కార్లు, ఒక మోటార్ సైకిల్, మారణాయుధాలు అయిన 3 సుత్తెలు, 02 మచ్చు కత్తులు, 02 చెట్ల అడ్డాలు, 02 కట్టెలు స్వాధీనం, రిమాండ్ కు తరలింపు+

14 రోజులు జ్యుడిషియల్ రిమాండు విధించిన మొదటి AJFCM కోర్టు… రెడ్డిపల్లి జైలు కు తరలింపు

నిన్నటి దినం అనగా 23.11.2025 ఉదయం 9.30 am సమయంలో అనంతపురం టౌన్, సాయి నగర్ 3rd క్రాస్ లో గల శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పై దాడిచేసి , ధ్వంసం చేసిన విషయం గా బెడుదల శ్రీలత, అడ్వకేట్ గారు పిర్యాదు లో మొగలి సత్యనారాయణ రెడ్డి అతని అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి హాస్పిటల్ లోకి అక్రమ ప్రవేశం చేసి హత్యాయత్నం చేసి బెదిరించినారని ఇచ్చిన పిర్యాదు మేరకు కేస్ రిజిస్టర్ చేయడమైనది

దాడికి కారణాలు:

2020 సం,, రం లో ఓల్డ్ పావని హాస్పిటల్ ఓనర్ గుత్తా పావని నుంచి 1.J. శ్రీనివాస రావు, 2. మొగలి సత్యనారాయణ రెడ్డి, 3.A.రాఘవేంద్ర, 4. బెడుదల శ్రీలత అను వార్లు కొని శ్రీనిలయం ఫర్మ్ మీద రిజిస్ట్రేషన్ చేసుకొని, తర్వాత శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు 10 సం,, రాల లీజు కు ఇచ్చారు అందులో భాగంగానే శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓనర్లు అయిన శ్రీనివాస రావు, రాఘవేంద్ర లు రెనోవేషన్ చేసుకొని త్వరలో ఓపెన్ చేసుకోవాలని అనుకుంటుండగా ఇందులో ఓన్లీ రెంటల్ పార్టనర్ అయిన మొగలి సత్యనారాయణ రెడ్డి దురుద్దేశంగా హాస్పిటల్ షేర్ ఇవ్వాలని నిన్నటి దినం అనగా 23.11.2025 వ తేది ఉదయం అతని అనుచరులతో మారణాయుధాలతో అక్రమంగా ప్రవేశించి, దౌర్జన్యం గా హత్యాప్రయత్నం చేయగా ఇచ్చిన పిర్యాదు మేరకు కేస్ రిజిస్టర్ నమోదు చేయడ మైనది

అరెస్ట్:- సదరు కేస్ విషయంగా ఈరోజు అనగా 24.11.2025 వ తేది మధ్యాహ్నం అడ్వకేట్ మొగలి సత్యనారాయణ రెడ్డి మరియు అతని ఆరు మంది అనుచరులను ప్రసన్నాయ పల్లి గేట్ వద్ద అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన 3 కార్లు, ఒక మోటార్ సైకిల్ మరియు మారణాయుధాలు అయిన 3 సుత్తెలు, 02 మచ్చు కత్తులు, 02 చెట్ల అడ్డాలు, 02 కట్టెలు స్వాధీనం
చేసుకొని రిమాండ్ కు తరలించడ మైనది

అరెస్ట్ అయిన వారి వివరాలు:

  1. మొగలి సత్యనారాయణ రెడ్డి, వయస్సు 45 సంవత్సరాలు, S/o M. హనుమంత రెడ్డి, N/o తిమ్మాపురం గ్రామం, కంబదూరు మండలం, అనంతపురం జిల్లా, R/o D.No: 4-3-93, జనశక్తి నగర్, బళ్లారి బైపాస్ రోడ్, అనంతపూర్ టౌన్, వృత్తి : అడ్వకేట్.
  2. చిన్నగొర్ల సాయినాథ్ రెడ్డి, వయస్సు 46 సంవత్సరాలు, S/o లేట్ చిన్నగొర్ల రామిరెడ్డి, N/o D.No: 5/54, చియ్యేడు గ్రామం, అనంతపూర్ రూరల్ మండలం, Now R/o మార్కెట్ యార్డ్ ఎదురుగా, L.B. కాలనీ, అనంతపురం టౌన్, అనంతపురం జిల్లా, వృత్తి : కాంట్రాక్టర్.
  3. బోయ సీతారాములు, వయస్సు 23 సంవత్సరాలు, S/o బోయ రామచంద్ర, D.No: 3-10, B.C. కాలనీ, దాసంపల్లి గ్రామము, కళ్యాణదుర్గం మండలం, వృత్తి : డ్రైవర్.
  4. ప్యారక్క గారి యువరాజ్, వయస్సు 20 సంవత్సరాలు, S/o P. నరసింహులు, కులం – D.No: 4-44,దాసంపల్లి గ్రామం, కళ్యాణదుర్గం మండలం, వృత్తి : కూలీ.
  5. యెరుకల చంద్రశేఖర్, వయస్సు 21 సంవత్సరాలు, S/o Y. నారాయణస్వామి, నారాయణపురం గ్రామం, కళ్యాణదుర్గం మండలం, వృత్తి : వ్యవసాయము
  6. సున్ని షాషావలి @ షాషు, వయసు 26 సంవత్సరాలు, S/o లేట్ ఖాజావలి, D.No: 28-58, కౌల్ బజార్, ఆజాద్ నగర్, బళ్లారి టౌన్, కర్ణాటక రాష్ట్రం, వృత్తి : కారు డ్రైవర్
  7. బురుజుల నవీన్, వయస్సు 25 సంవత్సరాలు, S/o B. వెంకటేశులు,D.No: 3-75, O.C. కాలనీ, విడపనకల్లు గ్రామం & మండలం, అనంతపురం జిల్లా , కారు డ్రైవర్

ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
అనంతపురం 2 టౌన్