..భారత్ న్యూస్ హైదరాబాద్….ఇళ్లకు దరఖాస్తు చేసుకోండి…. హౌసింగ్ పీడీ రమేశ్
ఇళ్లు లేని నిరు పేదలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని హౌసింగ్ పీడీ రమేశ్ తెలిపారు.
గురువారం ఆయన పీఎం ఆవాస్ యోజన పథకం పరిశీలించి కింద సిబ్బంది స్వీకరించిన దరఖాస్తులను హౌసింగ్, ఇంజనీరింగ్ అసి స్టెంట్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30వ తేదీలోగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇళ్లు లేని వారిని గు ర్తించి వారితో దరఖాస్తు చేయించాలని తెలిపారు.
ఇంటి స్థలం లేని పేదలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
కాగా ఇప్పటికే 828 మంది లబ్ధిదారులు నమోదు చేసుకోగా వారిలో 756 మందికి ఇంటి స్థలం ఉండగా, 72 మంది స్థలం లేని వారు ఉన్నట్లు తెలిపారు.
సిబ్బంది ప్రతి ఒక్కరూ కచ్చి తంగా గ్రామాల్లో పర్యటించి మరింతమంది లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని తెలిపారు.
కార్యక్రమంలో డీఈ దీనదయాల్ రాజ్, ఏఈ అమరనాథ్, ఇంజనీరింగ్ అసి స్టెంట్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
