సీఎం, మంత్రులకు ఒక్క రోజు లేట్ అవ్వకుండా జీతాలు వస్తున్నాయి..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సీఎం, మంత్రులకు ఒక్క రోజు లేట్ అవ్వకుండా జీతాలు వస్తున్నాయి.. వాళ్ళు బయటకు వెళ్తే వాహనాల ఖర్చులు, తిండి ఖర్చులు వస్తున్నాయి.. కష్టపడి పని చేసిన మాకు ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు

వైద్య ఆరోగ్య శాఖలో NHM పథకం కింద పని చేస్తున్న 17,000 మందికి 3 నెలలుగా ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు

తెలంగాణలోనే పెద్ద పండుగ దసరా.. ఆ పండుగకు కూడా జీతాలు రాక కనీస సరకులు తెచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి మమ్మల్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది

మా బంగారం తాకట్టు పెట్టి అద్దె కట్టి పూట గడుపుకొని బ్రతుకుతున్నాం.. ఇప్పటికైనా జీతాలు ఇవ్వకపోతే మాకు రోడ్ల మీద పడుకునే పరిస్థితి వస్తుంది

ధర్నాకు రావడానికి కిరాయిలకు కూడా డబ్బులు లేని దయనీయ స్థితిలో కొంతమంది ఉద్యోగులు ఉన్నారని NHM ఉద్యోగి ఆవేదన

మాకు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లో వచ్చిన ఉద్యోగాలే తప్ప కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు…