ప్రగతి సూచీల్లో పతనం.. అంతర్జాతీయ ఇండెక్సుల్లో జారుడు మెట్లపై భారత్‌,

భారత్ న్యూస్ గుంటూరు…ప్రగతి సూచీల్లో పతనం.. అంతర్జాతీయ ఇండెక్సుల్లో జారుడు మెట్లపై భారత్‌

ఏ దేశం అభివృద్ధి స్థాయినైనా అంచనా వేయడానికి అంతర్జాతీయ సూచీలు ఒక ముఖ్యమైన ప్రమాణం. ఆర్థిక వ్యవస్థ, మానవ హక్కులు, మీడియా స్వేచ్ఛ, అవినీతి స్థాయి, ప్రజాస్వామ్య నాణ్యత, జీవన ప్రమాణం వంటి పలు అంశాలను ఆధారంగా చేసుకుని వివిధ సంస్థలు ప్రతి ఏడాది ర్యాంకులను విడుదల చేస్తాయి.

అవినీతి సూచీలో 2014లో 85వ ర్యాంకులో ఉండగా, 2024లో 96కు చేరింది.

డెమోక్రసీ ఇండెక్స్‌లో 2014లో 27వ ర్యాంకులో ఉన్న భారత్‌, 2024లో 41కి పడిపోయింది.

మానవ అభివృద్ధి సూచీని చూస్తే 2014లో భారత్‌ ర్యాంక్‌ 130. అది ఇప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా అలానే ఉంది.

ప్రెస్‌ ఫ్రీడమ్‌ సూచీలో భారతదేశం 2014లో 140లో ఉండగా, నేడు అది 151కు దిగజారింది. పాత్రికేయులపై హింస, అధిక కేంద్రీకృత మీడియా యాజమాన్యం, రాజకీయ సమలేఖనం కారణంగా, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతికా స్వేచ్ఛ సంక్షోభంలో ఉంది అని ఈ అంకెలు చెబుతున్నాయి.

కాటో ఇన్‌స్టిట్యూట్‌ మానవ స్వేచ్ఛా సూచికలో భారతదోశం 2014లో 87లో ఉండగా, నేడు 110కి చేరింది.

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో 2014లో 110లో ఉండగా, నేడది 131కు చేరింది.

పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యంలో 14.7 శాతం నుంచి 2025కు 13.8 శాతానికి పడిపోయింది. అదే విధంగా మంత్రి పదవులలో మహిళల వాటా 6.5 శాతం నుంచి 5.6 శాతానికి తగ్గిపోయింది.

భారత్‌లో ఆకలి కేకలు

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రకారం 2014లో మొత్తం 76 దేశాలలో భారత్‌ 55వ స్థానంలో ఉండగా, నేడు 123 దేశాలలో 102వ స్థానంలో ఉంది. ‘భారతదేశంలో ఆకలి స్థాయి తీవ్రంగా ఉంది’ అని ఈ నివేదిక చెబుతున్నది.

రూల్‌ ఆఫ్‌ లా ఇండెక్స్‌లో 2014లో 66వ ర్యాంకులో ఉండగా, తాజాగా అది 79కి దిగజారింది.

వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్టులో 2014లో 111వ ర్యాంకులో ఉండగా, తాజాగా అది 126కు పడిపోయింది.