బెలూన్లు, శాస్త్రీయ పరికరాలు కనబడితే వెంటనే సమాచారం ఇవ్వండి: బహుమతి పొందండి.

భారత్ న్యూస్ నెల్లూరు….బెలూన్లు, శాస్త్రీయ పరికరాలు కనబడితే వెంటనే సమాచారం ఇవ్వండి: బహుమతి పొందండి.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈ బెలూన్లు కనపడితే సమాచారం ఇవ్వండి బహుమతులు పొందండి.

టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR), అణు శక్తి శాఖ మరియు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ల సంయుక్త ఆధ్వర్యంలో

2025 డిసెంబర్ 31 వరకు శాస్త్రీయ బెలూన్ ప్రయోగాలు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సైంటిస్టు డాక్టర్ టి. వెంకటేశ్వరరావు సోమవారం  తెలిపారు.

శాస్త్రీయ బెలూన్ ప్రయోగాలు పూర్తైన అనంతరం పరికరాలు బెలూన్‌ నుండి విడిపోయి రంగుల ప్యారా షూట్లతో నెమ్మదిగా భూమి పైకి వస్తాయన్నారు.

గాలుల దిశను బట్టి ఇవి హైదరాబాద్‌ నుండి 200 నుండి 350 కి.మీ దూరం లోని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందన్నారు.

ముఖ్యంగా విశాఖపట్నం, హైదరాబాద్, షోలాపూర్ ప్రాంతాల్లో దీని పరిధి వ్యాపించే అవకాశం ఉందన్నారు.

పాలిథిన్ పదార్థంతో తయారైన ఈ బెలూన్ల వ్యాసం 50 నుండి 85 మీటర్ల వరకు ఉంటుందన్నారు.

\ఇవి ఈసీఐఎల్ ప్రాంతంలోని టీఐఎఫ్ఆర్ బెలూన్ ప్రయోగ కేంద్రం నుండి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6.30 గంటల మధ్య హైడ్రోజన్ వాయువుతో నింపి వదులుతారన్నారు.

ఇవి 30 కి.మీ నుండి 42 కి.మీ ఎత్తు వరకు చేరి శాస్త్రీయ పరికరాలతో ప్రయోగాలు నిర్వహిస్తాయన్నారు.

ఈ పరికరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్ కడప మరియు విశాఖపట్నం జిల్లాల్లో పడవచ్చునని తెలిపారు.

ఆ ప్యారషూట్లలో ఉన్న శాస్ట్రీయ పరికరాలు సున్నితమైనవి అయినందున వాటిని తాకడం, పగులగొట్టడం చేయరాదన్నారు.

వాటిని గుర్తించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్, పోస్టాఫీస్ లేదా జిల్లా అధికారులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత శాస్త్రవేత్తలు పరికరాలను సేకరిస్తారు.

పరికరాలను గుర్తించి తగిన సమాచారం అందించిన వారికి తగిన బహుమతి, ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారన్నారు.

పరికరాన్ని తెరిచినా, పాడు చేసినా ఎటువంటి బహుమతి ఇవ్వడం జరగదన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ బెలూన్లు లేదా పరికరాలను గుర్తించే అవకాశం ఉన్నందున విస్తృతంగా ప్రచారం కల్పించాలని టీఐఎఫ్ఆర్ సైంటిస్టు డాక్టర్ టి. వెంకటేశ్వరరావు తెలియజేశారు.

జారీ చేసినవారు: సంచాలకులు సమాచార పౌరసంబంధాల , ఆంధ్రప్రదేశ్.