అటెంప్ట్ మర్డర్ కేసులో ఇద్దరు నిందితులకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఒక్కొకరికి 500/- రూపాయాల జరిమాన.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….జోగుళాoబ గద్వాల్ జిల్లా పోలీస్

అటెంప్ట్ మర్డర్ కేసులో ఇద్దరు నిందితులకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఒక్కొకరికి 500/- రూపాయాల జరిమాన.

క్రింది కోర్టు విధించిన శిక్షను సమర్దించిన గౌరవ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి శ్రీమతి ప్రేమలత గారు

సాగునీటి కమిటీ మెంబర్ గా ఉన్నందున అక్రమంగా నీటిని మలించవద్దు అనీ సర్ది చెప్పేందుకు వచ్చిన వ్యక్తి పై హత్య ప్రయత్నం చేసిన ఇద్దరు నిందితులకు 5 సంవత్సరాల జీవిత కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికీ 500/- రూపాయాల జరిమానా విధిస్తూ జనవరీ నెల 2023 లో అడిషనల్ సీనియర్ సివిల్ సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వగ అట్టి తీర్పును సవాల్ చేస్తూ నిందితులు జిల్లా కోర్టు కు వెళ్లగా క్రింది కోర్టు ఇచ్చిన తీర్పు ను సమర్దిస్తూ ఈ రోజు తీర్పును వెల్లడించారు.

వివరాలు:

రాజోలి మండలo బుడమోర్సు గ్రామానికీ చెందిన కుర్వ లక్ష్మి నారాయణ s/0 గిడ్డయ్య , వయస్సు- 45 సంవత్సరాలు అను వ్యక్తి తేది 06/03/2018 రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇచ్చిన పిర్యాదు ఏమనగా మా గ్రామ శివారు లో వున్న శ్రీ రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ద్వార గ్రామ శివారు పొలాలకు సాగు నీరు పారెందుకు 10మంది తో ఏర్పడిన కమిటిలో సభ్యునిగా ఉన్నానని, శివారులో నీరు సక్రమంగా పారెందుకు చిన్న గిడ్డయ్యా తో సహా ముగ్గురిని లష్కర్ లు కమిటీ నియమించడం జరిగిందనీ, ఎలాంటి సమస్య తలెత్తిన లష్కర్ లో ఉన్నవారు కమిటీకి తెలియజేస్తే సమస్యలు పరిష్కరించే వారమని ఆ క్రమంలో తేది 06/03/2018 రోజు ఉదయం 11:00 గంటలకు లస్కర్ గా ఉన్న చిన్న గిడ్డయ్య కమిటీ మెంబర్ ల దగ్గరకు వచ్చి నిన్న రాత్రి (O5/03/2018 ) వచ్చి తుర్క శిలారు మియ్య పొలం వద్ద MK రాముడు పొలం కు నీరు పారుతుంటే అదే గ్రామానికీ చెందిన A1 కుర్వ గోకారి వచ్చి నీరు మా పొలానికి పారాలని చెప్పి నాన భూతులు తిడుతూ అక్కడ నుండి తనను (గిడ్డయ్య) ను వెనుకకు పంపించారని తెలుపగా తేది 06/03/2018రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కమిటీ మెంబర్ లము అందరము తూర్క శిలారు మియ్యా పంపు వద్దకు చూడగా అక్కడ కుర్వ గోకారి , అతని తమ్ముడు A2 కాశన్న ఉన్నారని, వారిద్దరినీ పిలిచి వంతుల ప్రకారం అందరికీ సాగు నీరు పారలి కదా ఎందుకు సాగు నీటిని ఇతరులకు పారకుండ అడ్డుకుంటున్నారు అని అడుగగా కుర్వ గొకారి మా మాటలకు అడ్డుతగిలి నీవు ఎవడవు రా నీళ్లు మలుపడానికి అంటు నాన బూతులు తిడుతూ ముందు మాకే పారాలి అనగా ఆ క్రమంలో నేను (లక్ష్మి నారాయణ) వెళ్లి కాలువకు వున్న గట్టును తీయడానికి వెళ్లగా కుర్వ గొకారి అక్కడే వున్న సుబాబుల కట్టెను తీసుకోని నా తల పై బలంగా కొట్టగా తలకు రక్త గాయం అయినది అని, వెంటనే వాళ్ళ తమ్ముడు A2 కుర్వ కాశన్న నన్ను చేతులతో కొట్టుతూ ఇద్దరు కలిసి నన్ను ఈత చెట్టు పొద పై పడవేసి ఈత చెట్టు కొమ్మతో నా గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చంపడానికి ప్రయత్నించగా అక్కడే వున్న కమిటీ సభ్యులు విడిపించారని , లేకుంటే తనను చంపెవారని , అక్రమంగా నీరు పారించడమే కాకుండా నీరు పారించే విషయంలో సర్ది చెప్పడానికి పోతే గతం లో జరిగిన రోడ్డు పంచాయతి విషయం ను మనసులో పెట్టుకొని నన్ను చంపటానికి ప్రయత్నించిన కుర్వ గొకారి s/o సవరన్న , కుర్వ కాశన్న s/o సవారన్న ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు ఇవ్వగా రాజోలి పోలీస్ స్టేషన్ లో క్రైం నె o 19/2018 u/s 307 r/w 34 ipc గా కేసు నమోదు చేసుకొని అప్పటి పోలీసులు కోర్టు లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇట్టి కేసులో అడిషనల్ సీనియర్ సివిల్ సెషన్స్ కోర్టు జడ్జి గద్వాల్ గారు కేసు పూర్వపరాలను విచారించి, వాదోపవాదనలు విన్న తర్వాత తేది 02.01.2023 నాడు నిందితులు A1- కుర్వ గొకరి s/o సవారన్న, వయసు-43 సం”లు, A2-కుర్వ కాశన్న s/o సవారన్న, వయసు-30 సం”లు లకు హత్యాయత్నం కు సంబంధించి 5 సంవత్సరాల కఠినకారాగార శిక్షను, మరియు ఒక్కొక్కరికీ 500/- రూపాయాల జరిమాన జరిమాన విధించడం జరిగినది. ఇట్టి తీర్పును సవాలు చేస్తూ నిందితులు జిల్లా కోర్టు కు వెళ్లగా ఈ రోజు గౌరవ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి శ్రీమతి ప్రేమలత క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్దిస్తూ ఈ రోజు తీర్పును వెల్లడించారు.
ఈ సందర్బంగా పై కోర్టు లో కూడా నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐ పి ఎస్ గారు అభినందించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాoబ గద్వాల్ జిల్లా