భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆరేళ్ల తర్వాత చైనాకు ఎయిరిండియా
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ సోమవారం కీలక ప్రకటన చేసింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత చైనాకు మళ్లీ తమ సర్వీసులను నడుపుతున్నట్టు వెల్లడించింది.
2026 ఫిబ్రవరి 1 నుంచి ఢిల్లీ- చైనాలోని షాంఘై నగరాల మధ్య నాన్ స్టాప్ విమానాలను నడపనున్నట్లు తెలిపింది.
వారానికి నాలుగు సార్లు బోయింగ్ 787-8 విమానాలతో సేవలు అందిస్తామని పేర్కొంది.
ఈ విమానంలో బిజినెస్ క్లాస్ 18 ఫ్లాట్ బెడ్ సీట్లు, ఎకానమీ క్లాస్లో 238 విశాలమైన సీట్లు అందుబాటులో
ఉంటాయని వివరించింది.
