భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ములుగు జిల్లా లో ఇది పరిస్థితి*
జ్వరంతో బాధపడుతున్న ఓ గుత్తికోయ వ్యక్తిని డోలిలో ఆసుపత్రికి తీసుకొచ్చిన ఘటన మంత్రి సీతక్క సొంత జిల్లా అయిన ములుగు పరిధి వెంకటాపురంలో జరిగింది.
పామూరుకు చెందిన మడవి ఆడుమ అనే వ్యక్తి 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు.
స్థానికులు గమనించి పామూరు గుట్టలపై నుంచి ఓ కర్రకు డోలీ కట్టి బొల్లారానికి, అక్కడి నుంచి 108లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ MGMకు తరలించారు.