ఫించన్ డబ్బు మరియు రైతు ల సొమ్ము దుర్వినియోగం కేసులో సచివాలయ ఉద్యోగి అరెస్టు..

భారత్ న్యూస్ గుంటూరు…ఫించన్ డబ్బు మరియు రైతు ల సొమ్ము దుర్వినియోగం కేసులో సచివాలయ ఉద్యోగి అరెస్టు..
రూ. 60 వేల నగదు ఫించన్ డబ్బు మరియు 50 వేల నగదు రైతుల డబ్బు ఆన్ లైన్ గేమ్ ఆడేందుకు ఉపయోగించిన సెల్ ఫోన్ స్వాధీనం

సింహాద్రిపురం PS Cr. No. 210/2025 U/s 316(5)BNS కేసులోని ముద్దాయి మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి, వయసు 27 సంవత్సరాలు, తండ్రి రాజగోపాల్ రెడ్డి, వృత్తి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఇన్ అంకాలమ్మ గూడూరు విలేజ్, సింహాద్రిపురం మండలం అను అతనిని పులివెందుల టౌన్ లోని పులివెందుల టౌన్ లోని కడప రోడ్ లో గల చందమామ డాబా దగ్గర నిన్నటి దినం అనగా 14.11.2025 వ తేదీ సాయంత్రం 6 గంటలకు అరెస్టు చేసి అతని వద్ద నుండి పింఛన్ కు సంబంధించి 60 వేల రూపాయలు డబ్బులు మరియు రైతులు నుంచి విత్తనాలకు మరియు ఎరువులకు వసూలు చేసిన 50 వేల రూపాయలు డబ్బును మరియు అతను ఆన్లైన్ గేమ్ కోసం ఉపయోగించిన ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడమైనది.

కేసు వివరాలు అంకాలమ్మ గూడూరు సచివాలయం లో పనిచేసే ప్రవీణ్ కుమార్ రెడ్డి అను అతను ఆగస్టు నెలలో బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు అతను వీధి నిర్వహణలో భాగంగా వృద్ధాప్య, వితంతు ఫించన్ పంచకుండా Rs 6,25,000/- డబ్బును తన స్వంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు, అదేవిధంగా రైతుల వద్ద నుండి సబ్సిడీ విత్తనాలకు Rs.10,74,720/- ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయవలసి ఉంది. ఎరువులకు Rs.7,27,835.35/-డబ్బులు వసూలు చేసి సదరు వసూలు చేసిన డబ్బులను వెరసి మొత్తం Rs. 18,02,555.35 రూపాయలను ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయవలసి ఉంది. అయితే సదరు డబ్బును మరియు Rs. 6,25,000/- ఫించను డబ్బులను దుర్వినియోగం చేశాడని ఫిర్యాదు.
మొత్తం దుర్వినియోగం చేసిన డబ్బు : Rs.24,27,555.35 ps

kadapapolice