కడప నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలు సేవించే వారిపై, అసాంఘిక కార్యకలాపాలపై అనుమానిత ప్రాంతాలపై స్పెషల్ పార్టీలతో స్పెషల్ డ్రైవ్ తో దాడులు,

భారత్ న్యూస్ అనంతపురం…కడప నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలు సేవించే వారిపై, అసాంఘిక కార్యకలాపాలపై అనుమానిత ప్రాంతాలపై స్పెషల్ పార్టీలతో స్పెషల్ డ్రైవ్ తో దాడులు, అత్యాధునిక డ్రోన్ కెమెరాల నిఘా…
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జల్లెడ పడుతున్న పోలీసులు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

కడప నవంబర్ 16: గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై కఠిన చర్యలకు పోలీస్ అధికారులు స్పెషల్ పార్టీ సిబ్బంది ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ మరియు డ్రోన్ కెమెరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు కడప డి.ఎస్.పి శ్రీ ఎ.వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో కడప నగరం వన్ టౌన్, టూ టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అనుమానిత ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, కడప సబ్ డివిజన్ స్పెషల్ పార్టీ సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల తో పాటు పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి జల్లెడ పడుతూ దాడులు చేయిస్తూ నిందితులను గుర్తించే కార్యక్రమం చ