అముర్‌ జాతికి చెందిన ఓ గద్ద కేవలం రెండు రోజుల్లో 1500 కి.మీ. ప్రయాణించింది.

భారత్ న్యూస్ నెల్లూరు….అముర్‌ జాతికి చెందిన ఓ గద్ద కేవలం రెండు రోజుల్లో 1500 కి.మీ. ప్రయాణించింది.

శాటిలైట్‌ ట్రాన్స్‌మీటర్‌ అమర్చిన ఈ గద్ద మణిపూర్‌ నుంచి ఒడిశాకు చేరుకుంది.

భారత్‌ వన్యప్రాణుల సంస్థ (డబ్ల్యూఐఐ)కు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త సురేష్‌కుమార్‌ ఈ వివరాలను వెల్లడించారు.

ట్రాన్స్‌మీటర్‌ అమర్చిన మగ గద్ద (అపాపంగ్‌)ను నవంబరు 11న మణిపూర్‌ అటవీ ప్రాంతంలో వదిలారు.

ఒడిశాలోని బాలేశ్వర్, సతకోషియా, ఫుల్బాణీ మీదుగా ఎగిరిన గద్దను నవంబరు 13న ఉదయం 11.30 లకు కొంధమాల్‌లోని బాలిగూడ ప్రాంతంలో గుర్తించారు.

3.5 గ్రాముల బరువున్న ట్రాన్స్‌మీటర్‌ అమర్చిన మరో రెండు ఆడ గద్దలను (అహు, అలాంగ్‌) వదిలినట్లు సురేష్‌ పేర్కొన్నారు.
ఒరిస్సా ఈనాడు దినపత్రిక సౌజన్యంతో