Andhra: ఓ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఏంటా అని ఆరా తీయగా..

భారత్ న్యూస్ విశాఖపట్నం..Andhra: ఓ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఏంటా అని ఆరా తీయగా..

Ammiraju Udaya Shankar.sharma News Editor…గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఓ యువకునితో పాటుగా గంజాయి సేవించేందుకు కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురు యువకులను బాపట్ల జిల్లా చీరాల రురల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గరి నుంచి 1250 గ్రాముల నిషేధిత గంజాయితో పాటు వేయి రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వేటపాలెం జబ్బార్ కాలనీ లో నివాసముంటున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ జేన..ఒడిశా నుంచి వేటపాలెంకి కూలీలను పనికి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో ఒడిశా లోని తన స్నేహితుడు అనిల్ గౌడ్ దగ్గర తక్కువ ధరకు నిషేధిత గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా.. గంజాయి విక్రయిస్తూ ప్రభాకర్ జేన పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో గంజాయిని సేవించేందుకు కొనుగోలు చేస్తున్న షేక్ ఇమ్రాన్ బాషా, కటారి వెంకటేశ్వర్లు, నారాయణ సాహు అనే మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చీరాల రూరల్‌ సీఐ శేషగిరిరావు తెలిపారు. ప్రభాకర్ జేన నెట్‌వర్క్, అతనికి సహకరిస్తున్న వారి గురించి వివరాలు ఆరాతీస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.