లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు

లంచం ఇవ్వకపోతే పని జరగదని రైతులకు తేల్చి చెప్తున్న అధికారులు

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహాణీ కోసం, తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు

పోలియో పహాణీ తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా, పహాణీ సిద్ధంగా ఉంది కానీ తమ ఖర్చులకు రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన రికార్డు అసిస్టెంట్

తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పడంతో, డబ్బులు ఇస్తేనే పహాణీ ఇస్తామని రికార్డు అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతు మల్లయ్య