భారత్ న్యూస్ విజయవాడ…ప్రాణాన్ని కాపాడిన స్ఫూర్తిదాయక పోలీస్ జి. నవ్య
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉన్న ఒక మహిళ కుటుంబ సమస్యల కారణంగా కృష్ణానదీ బ్యారేజ్ పై దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళా ట్రాఫిక్ పోలీస్ 3250 జి. నవ్య గారు, పరిస్థితిని గమనించి అప్రమత్తమై , మానవతా భావంతో వెంటనే స్పందించి, ఆ మహిళను వెనుకనుండి పట్టుకుని కిందకు దింపి ప్రాణాలను కాపాడారు.
తర్వాత ఆమెను వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు, అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు.

పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్. గారు, ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షిరీన్ బేగం, ఐ.పి.ఎస్. గారు మరియు ప్రోత్సహిస్తుంది మహిళా కానిస్టేబుల్ జి. నవ్య గారిని, మానవత్వానికి ప్రతీకగా ధైర్యం చెప్పారు.