విజ్ఞేశ్వరస్వామి దేవాలయంలో చోరి

భారత్ న్యూస్ విజయవాడ…ఎన్టీఆర్ జిల్లా నందిగామ

విజ్ఞేశ్వరస్వామి దేవాలయంలో చోరి

నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్లో గల విజ్ఞేశ్వరస్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు.

దేవాలయ గేట్ల తాళాలు పగులకొట్టి లోపలికి చొరబడి హుండీని ధ్వంసం చేసి సుమారు రూ. 30 వేలు అపహరించినట్లుగా సమాచారం.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.