పులివెందుల, వేముల మరియు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాల కేసులను చేధించిన పోలీసులు..ఇద్దరు దొంగలు అరెస్టు

భారత్ న్యూస్ నెల్లూరు….పులివెందుల, వేముల మరియు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాల కేసులను చేధించిన పోలీసులు..
ఇద్దరు దొంగలు అరెస్టు

కడప జిల్లా ఎస్పీ శ్రీ శెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS గారి ఆదేశాల మేరకు, పులివెందుల సబ్‌ డివిజన్‌ డీఎస్పీ శ్రీ బి. మురళి గారి ఆధ్వర్యంలో లింగాల, తొండూరు, పులివెందుల, వేముల మరియు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న దొంగతనాల కేసులను సోదీంచి, వాటిలో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను పులివెందుల పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
అరెస్టు చేయబడిన నిందితులు:

బుడగ జంగం మోతి నాగరాజు, వయస్సు: 50 సంవత్సరాలు, తండ్రి: మోతి దస్తగిరి, వృత్తి: కూలీ, ప్రస్తుత నివాసం: దొరసానిపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం.
నిందితులు గత కొద్ది రోజులుగా పులివెందుల సబ్‌ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో ఇళ్లలో చోరీలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చారు. వీరి వద్ద నుండి పోలీసులు దొంగిలించిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు మరియు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

బుడగ జంగం మోతి జమ్మయ్య, వయస్సు: 21 సంవత్సరాలు, తండ్రి: జంగం మోతి నాగరాజు, వృత్తి: అల్యూమినియం–స్టీల్ పాత్రలు అమ్మడం / కూలీ, ప్రస్తుత నివాసం: దొరసానిపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం.