భారత్ న్యూస్ విజయవాడ: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫ్రాంఛైజీలు రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్ట్ త్వరలో

ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ మూడో వారంలో జరిగే అవకాశముంది. ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే, వేలానికి వదిలేసే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోపు సమర్పించాలని బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. కొన్ని జట్లు కొంతమంది ఆటగాళ్లను ట్రేడ్ చేసుకుంటాయనే వార్తలొస్తున్నాయి. దీంతో ఏ ఆటగాడు ఏ జట్టుకు మారతాడు? ఏ టీమ్ నుంచి ఎవరిని రిలీజ్ చేస్తారు?అని నెట్టింట క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఏ జట్టు ఎవరిని రిలీజ్ చేసే అవకాశముందో కొద్ది రోజులు పాటు వేచి చూడాల్సిందే…