భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి:నవంబర్ 13
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కీలక వేదికగా నిలవనున్న 30వ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరి శ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రే విశాఖకు చేరుకున్నారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు, ఒప్పందాలు, శంకుస్థాపనలు జరగనున్నా యి. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టు బడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.
గురువారం 10 గంటలకు నోవోటెల్‌లో జరిగే ‘ఇండియా-యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్’ సమావేశంతో సీఎం కార్యక్రమాలు ప్రారంభమ వుతాయి. యూరోపియన్ పెట్టుబడులు, గ్రీన్ షిఫ్ట్, సస్టెయినబుల్ ఇన్నోవేషన్ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనంతరం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతి నిధులతో పాటు ఎస్పీపీ పంప్స్, రెన్యూపవన్, మురుగప్ప గ్రూపు, హీరో ఫ్యూచర్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు.
శుక్రవారం అధికారికంగా సదస్సు ప్రారంభమైన తర్వాత ‘టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్’ అనే అంశంపై చర్చాగోష్ఠి జరగనుంది. మధ్యాహ్నం ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసం గించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఏఐ ఎలా దోహదపడుతుం దో వివరిస్తారు.
ఈ రోజే విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.సాయంత్రం విశాఖలో లులూ గ్రూప్ నిర్మించనున్న నూ తన మాల్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు.
సదస్సు చివరి రోజైన శనివారం కూడా పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్ ప్రాజెక్టు లకు ముఖ్యమంత్రి శంకు స్థాపన చేస్తారు. ముఖ్యం గా, టెక్ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు కూడా ఇదే రోజు శంకుస్థాపన చేయడం విశేషం. అనంతరం బహ్రెయిన్, న్యూజిలాండ్, కెనడా, జపాన్ దేశాల ప్రతినిధులతో భేటీ అవుతారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరానికి చెందిన ‘సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్’ను కూడా ప్రారంభిస్తారు. సాయంత్రం పలు సంస్థలతో అవగాహన ఒప్పందాల ఎంఓయూ,కార్యక్రమం ఉంటుంది. సదస్సు ముగింపులో మీడియా సమావేశం నిర్వహించి, సాధించిన ఫలితాలను సీఎం వివరిస్తారు.