ఇమామ్, మౌజమ్ వేతనాలకు రూ.90 కోట్లు విడుదల

భారత్ న్యూస్ నెల్లూరు….ఇమామ్, మౌజమ్ వేతనాలకు రూ.90 కోట్లు విడుదల

ఇమామ్, మౌజమ్ల గౌరవ వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం రూ.90 కోట్లు విడుదల చేసింది.

ఈ మేరకు మైనారిటీ సంక్షేమశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

నెలకు ఇమామ్లకు రూ.10 వేలు, మౌజమ్లకు రూ.5 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు.

గతేడాది ఏప్రిల్, మే, జూన్ సహా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఉన్న బకాయిల చెల్లింపునకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.

గౌరవ వేతనాల విడుదల పట్ల వక్ఫ్బర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ హర్షం వ్యక్తం చేశారు.

మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా పెండింగ్ బిల్లులను విడుదల చేయనున్నట్లు మంగళవారం సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.