చల్లపల్లి:
భారత్ న్యూస్ విజయవాడ…చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు
చల్లపల్లి:
కార్తీక మాసం సందర్భంగా మండల పరిధిలోని లక్ష్మీపురంలో వేంచేసియున్న శ్రీదుర్గాపార్వతి సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో గురువారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు భమిడిపాటి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఉదయం గం.9.30 నుంచి మధ్యాహ్నం గం.12ల వరకూ వ్రతాలు జరిపిస్తామని చెప్పారు. పూజలో పాల్గొనే భక్తులు ఎవరి పూజా సామాగ్రి వారే తెచ్చుకోవాలని పూజ అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేస్తామని పేర్కొన్నరు.
మరిన్ని వివరాలకు:
భమిడిపాటి బాలసుబ్రమణ్యం, ఆలయ అర్చకులు,
9441420061
