వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన నంద్యాలకు చెందిన విద్యార్ధిని షేక్‌ ఇష్రత్

భారత్ న్యూస్ మంగళగిరి…తాడేపల్లి

Ammiraju Udaya Shankar.sharma News Editor…వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన నంద్యాలకు చెందిన విద్యార్ధిని షేక్‌ ఇష్రత్

షేక్ ఇష్రత్‌ ఎస్ఎస్‌సీ 2025లో స్టేట్ సెకండ్ ర్యాంక్‌, 600 మార్కులకు 599 మార్కులు సాధించి రాష్ట్రస్ధాయిలో రెండో ర్యాంకు సాధించింది.

ఇష్రత్ ను అభినందించి, రూ. లక్ష ప్రోత్సాహకం ప్రకటించిన శ్రీ వైయస్‌ జగన్‌, ప్రతి మహిళా చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన వస్తుందని, ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని సూచన, చదువు వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించిన వైయస్‌ జగన్‌

ఈ సందర్బంగా వైయస్‌ జగన్‌ ను కలిసిన ఇష్రత్ తల్లిదండ్రులు భాను, ఎస్‌.ఎం.రఫి, వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్‌ ప్రెసిడెంట్‌ ఖాదర్‌ బాషా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఎ.హఫీజ్‌ ఖాన్‌, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్‌సీపీ నాయకులు నూరీ ఫాతిమా, షేక్‌ ఆసిఫ్‌, తదితరులు.