భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్
కాన్సర్‌తో చితికిన కుటుంబానికి ఎక్సైజ్ శాఖ చేయూత..
కాన్సర్ చికిత్సకు రూ. 2.45 లక్షల నగదును ఎక్సైజ్ కమిషనర్ అందజేత.
విధి అడిన ఆటలో ఇంటి యాజమానికి నోటి కాన్సర్, కుటుంబానికి కంటికి రెప్పలా చూసుకునే ఇంటి ఇల్లాలుకు అంగ వైకల్యం. సంతానంగా పుట్టిన ఇద్దరిలో 11 సంవత్సరాల కుమారుడికి మనో వైకల్యం, 9 ఏళ్ల చిన్నారికి పెరుగుతున్న కొద్ది ఎలాంటి రుగ్మత చోటు చేసుకుంటుందనే భయంలో బతుకుతున్న కుటుంబానికి రూ. 2.45 లక్షల అర్థిక సాయాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి హరికిరణ్ చేసి అదుకున్నారు.
మహ్మమద్ హైమద్ ఎక్సైజ్ శాఖ ధూళిపేట ఎక్సైజ్ స్టేషన్లో 12 సంవత్సరాలుగా ప్రైవేట్‌గా డ్రైవర్‌గా చేస్తున్నాడు. హైమద్ భార్య హర్షియా వికలాంగురాలు, వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరిలో 11 సంవత్సరాల రేహన్ మానసిక వికలాంగుడిగా ఉన్నాడు. 9 సంవత్సరాల అమ్మాయి ప్రస్తుతం బాగా ఉన్నా… భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయని భయాందనలో ఉన్న ఈ కుటుంబంలో పిడుగులాంటి వ్యాధి కాన్సర్ ఇంటి యజమానికి సోకిందని తెలియడంతో అందరు దు:ఖంలో మునిగి పోయారు.
హైమత్‌కు వచ్చిన కాన్సర్‌ను నయం చేసుకోవడానికి కష్టాలు పడుతున్న సమయంలో నాడు ధూళిపేట్‌లో పనిచేసిన కె.నవీన్ ప్రస్తుతం మల్కాజిగిరి
ఎక్సైజ్ సూపరిటెండ్గా పని చేస్తున్నారు. తనకు కొంత కాలంగా తన వాహనానికి డ్రైవర్‌గా పనిచేసిన హైమద్కు కాన్సర్ వచ్చిదని తెలిసిన వెంటనే ఆతని కుటుంబాన్ని అదుకోవాలని లక్ష్యంతో తాను స్వయంగా కొంత, ఎక్సైజ్ సిబ్బంది కొంత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ కలిపి మొత్తంగా రూ. 2.45 లక్షల అర్థిక సాయాన్ని మంగళవారం కమిషనర్, ఈఎస్ నవీన్ చేతుల మీదుగా కమిషనర్ చాంబర్లో నగదును అందించారు.
కాన్సర్ అపరేషన్ అవసరమైన సహకారం అందిస్తామని కమిషనర్ హమీ ఇచ్చారు.
హైమద్కు త్వరలో బసవతారకం కాన్సర్ ఆస్పత్రిలో నోటి కాన్సర్‌కు అపరేషన్ జరుగనుంది.

హైమద్ కుటుంబ పరిస్థితిని గమనించిన అధికారులు అవేదన వ్యక్తం చేశారు.