భారత్ న్యూస్ విజయవాడ…తల్లికి వందనం – చెల్లింపు విఫలమైనవారికి ముఖ్య సమాచారం!
ప్రభుత్వం తెలిపిన ప్రకారం, తల్లికి వందనం పథకంలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు నమోదయ్యాయి.
ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉన్నాయి:
పేమెంట్ ఫెయిల్ అయిన తల్లుల బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసి నవంబర్ 13, 2025లోపు అప్డేట్ చేయాలి.
మీ బ్యాంకు ఖాతా నంబర్ లేదా IFSC కోడ్ మారినట్లయితే, దయచేసి వెంటనే మీ సచివాలయ సిబ్బంది / బ్యాంకు శాఖ ను సంప్రదించండి.
సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంక్లో ఖాతా వివరాలు నవీకరించేలా సహాయం చేస్తారు.

గమనిక:
మీరు “తల్లికి వందనం” పథకానికి అర్హురాలైతే,
కానీ మీకు ఇంకా డబ్బు రాకపోతే,
వెంటనే మీ గ్రామ / వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.
చివరి తేదీ: నవంబర్ 13, 2025