భారత్ న్యూస్ గుంటూరు…వైఎస్ జగన్ మెమోపై నేడు విచారణ

Ammiraju Udaya Shankar.sharma News Editor…AP: అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ భవిష్యత్లో ఎలాంటి విదేశీ పర్యటనలకు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ వేసిన పిటిషన్పై నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో నిన్న విచారణ జరిగింది. ఈ నెల 14వ తేదీలోపు జగన్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై ఆయన మెమో దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై కౌంటర్ వేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. జగన్ మెమోపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.
