శివ..!
…భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్ బాస్ షో లో డ్యాన్స్ చేసి కనువిందు చేసిన నాగార్జున – అమల..!
శివ..!
నాగార్జున అమల నట జీవితాన్ని..వ్యక్తిగత జీవితాన్ని కూడా మలుపు తిప్పిన సంచలన చిత్రం..!
శివ సినిమా షూటింగ్ సమయం నుండే ప్రేమలో పడిన నాగార్జున అమల.. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో కలిసి నటించారు.. వివాహం చేసుకుని కలిసి ప్రయాణం ప్రారంబించారు..
తెలుగు ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో మాస్టర్ పీస్ గా నిలిచిపోయిన శివ చిత్రం.. రామ్ గోపాల్ వర్మను జాతీయ స్థాయి దర్శకుడిని చేసింది..!
ముప్పై ఆరు ఏళ్ల నాగార్జున అమల బంధానికి మధుర చిహ్నంగా నిలిచిపోయింది..!
అనేక రికార్డులు సృష్టించిన శివ సినిమా.. అనేక మంది నూతన కళాకారులకు వృత్తి పరంగా మంచి భవిష్యత్తును ఇవ్వగలిగింది..!
సినిమాలోని సైకిల్ చైన్ సీన్ దేశవ్యాప్తంగా ఇప్పటికీ పాపులర్..!

షోలే సినిమా తరహాలో దశాబ్దాలు గడుస్తున్నా శివ క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది..!