అత్యంత వైభవంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక,

భారత్ న్యూస్ రాజమండ్రి…అత్యంత వైభవంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

ఏలూరు, : సెయింట్ జేవియర్ హై స్కూల్ లో 1981 – 82 బ్యాచ్‌కి చెందిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం బొమ్ములూరులో అంగరంగ వైభవంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి గత స్మృతులను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరునొకరు ఆలింగనం చేసుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ స్థితిగతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. తమ బ్యాచ్ లో ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే అందరూ చేయి చేయి కలిపి వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు పదో తరగతి పాసై 43 సంవత్సరాలు గడవడంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుని, విద్యార్థులంతా ఇలా కలుసుకోవడం వల్ల స్నేహాలు బలపడతాయని తెలిపారు. ఆనాటి ఈ కార్యక్రమంలో 1981 – 82 బ్యాచ్‌ విద్యార్థులు పాల్గొన్నారు. ఇకనుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా ఎంతమంది కలిసి వచ్చిన ఇటువంటి కలయికలే ఏర్పాటు చేసుకోవాలని మిత్రులంతా నిర్ణయించుకున్నారు. అలనాటి గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలిమెట్ల మోజెస్ బాబు, తణుకు వెంకట సుబ్బారావు, బట్టు సుధాకర్, మల్లంపాటి అమర్ కుమార్, గుండా బత్తుల రామ్మూర్తి, తాళ్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంత మందిని ఒకే చోట కలవటానికి ప్రయత్నం చేసిన సుబ్బారావు, మోజెస్ బాబులను మిత్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మందికి పైగా విద్యార్థులు ఈ ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు, ఈ కలయిక తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అందరూ బాగుండాలని చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి అంటూ ఆత్మీయతతో ఒకలకొకళ్ళు చెప్పుకున్నారు.