ఆకాశంలో గిర్రున తిరుగుతూ కూలిన హెలికాప్టర్

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆకాశంలో గిర్రున తిరుగుతూ కూలిన హెలికాప్టర్

రష్యాకు చెందిన Ka-226 హెలికాప్టర్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్థాన్లోని కాస్పియన్ సముద్ర తీరంలో కుప్పకూలింది. దీంతో అందులోని పైలట్తోపాటు నలుగురు క్లిజియార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ ఉద్యోగులు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. తోక భాగం విరిగిపోవడంతో హెలికాప్టర్ అదుపు తప్పి పైకి, కిందికి వెళ్తూ గాల్లో గిర్రున తిరుగుతూ కుప్పకూలి పేలిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.