రాష్ట్ర పండుగగా కోటి దీపోత్సవం..వచ్చే ఏడాది నుండి అధికారికంగా నిర్వహిస్తాం..

భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్ర పండుగగా కోటి దీపోత్సవం..వచ్చే ఏడాది నుండి అధికారికంగా నిర్వహిస్తాం..

  • సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

••••••••

కోటిదీపోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…

14 సంవత్సరాలుగారచన టెలివిజన్ వారు కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

హైదరాబాద్ లో ప్రారంభమై దేశ సరిహద్దులు దాటి భక్త కోటికి హర హర మహాదేవ నామాన్ని వినిపిస్తున్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వారిని అభినందిస్తున్నా

ఆధ్యాత్మికత మనందరికీ ఒక శక్తిని, ఒక స్ఫూర్తిని అందిస్తుంది

నా జన్మదినం కోటి దీపోత్సవం కార్యక్రమంలో మీ మధ్య గడపడం నాకు జీవిత కాల జ్ఞాపకం

ఆశీర్వదించిన భక్తకోటికి నా అభినందనలు, శుభా కాంక్షలు

భక్తి టీవీ దేశంలోనే అత్యధిక భక్తులు వీక్షించే ఛానల్ గా మన్ననలు పొందుతోంది

ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తాం

జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జాతీయ పండుగగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తాం

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపేందుకు మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా

ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నా..