భారత్ న్యూస్ విశాఖపట్నం.కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన అత్యంత దురదృష్టకరం. 15-20 వేల మంది భక్తులు వచ్చారు. కనీస పోలీసు భద్రత కల్పించలేదు. లా అండ్ ఆర్డర్ నిర్వహించే పరిస్థితి లేదు. ఇదేమని అడిగితే, ముఖ్యమంత్రి, మంత్రులు అత్యంత బాధ్యతారాహిత్యంగా అది ప్రైవేట్ ఆలయం అంటున్నారు. ఇవేం మాటలు? ఏకాదశి పర్వదినానా జనాలు పెద్ద ఎత్తున వస్తారన్న చోట రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వం కాదా? ఆలయం ప్రారంభమై ఆరు నెలలు దాటింది. ఎక్కువ మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి అంచనా, బాధ్యత లేదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి, సింహాచలంలో ఇదే రకమైన ఘటనలు జరిగాయి. ఏ పండగలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినా తగిన ముందస్తు ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టే ఇలాంటి ఘటనలు లేవు.

-బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలి విపక్షనేత