డిసెంబర్‌ 31 లాస్ట్ డేట్.. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేశారా..

భారత్ న్యూస్ విశాఖపట్నం.డిసెంబర్‌ 31 లాస్ట్ డేట్.. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేశారా..?
డిసెంబర్‌ 31 తుది గడువు దగ్గరపడుతోంది. ఈ తేదీ లోపల పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేయకపోతే, మీ పాన్‌ కార్డు జనవరి 1, 2026 నుండి ఇన్‌యాక్టివ్‌ అవుతుంది. ఫలితంగా మీరు ఆదాయపన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయలేరు. SIPలు పెట్టుబడి పెట్టడం లేదా పన్ను వాపసులు పొందడం సాధ్యం కాకపోవచ్చు. టాక్స్‌బడ్డీ ప్రకారం, పాన్‌ ఇన్‌యాక్టివ్‌ అయితే Form 26AS, TDS/TCS వివరాలు కూడా కనిపించవు. ఇలా జరగకుండా ఉండాలంటే వెంటనే ఆదాయపు పన్ను శాఖ ఇ–ఫైలింగ్‌ పోర్టల్‌లో పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేయడం ఉత్తమం.