భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.మహిళ రక్షణ కోసమే షీ టీమ్స్: సీపీ
రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం మాట్లాడుతూ, మహిళల రక్షణకై షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని తెలిపారు. మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని, మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కమిషనరేట్ లో రెండు షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని, అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, బాలికలు, విద్యార్థులు షీ టీం సేవలు ఉపయోగించుకోవాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని సూచించారు…..
