భారత్ న్యూస్ రాజమండ్రి…క్లస్టర్ వ్యవస్థ రద్దు – పంచాయతీలకు స్వతంత్ర హోదా! 🌿
📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది!
ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి,
19,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది. ✅
🏛 ముఖ్య నిర్ణయాలు:
🔹 పంచాయతీలను 4 గ్రేడులుగా విభజించారు
🔹 పంచాయతీ కార్యదర్శుల పేరును “పంచాయతీ అభివృద్ధి అధికారి (PDO)”గా మార్చారు
🔹 ప్రతి పంచాయతీలో ఇప్పుడు ఉండబోయే విభాగాలు 👇
- పారిశుద్ధ్యం 🧹
- తాగునీటి సరఫరా 💧
- గ్రామీణ ప్రణాళిక 🏗
- వీధి దీపాలు 💡
- ఇంజినీరింగ్ 🧰
- ఆదాయం & పన్ను వసూళ్లు 💰
👨💼 సిబ్బంది మార్పులు:
🔹 రూర్బన్ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తారు
🔹 డిజిటల్ అసిస్టెంట్లతో ప్రత్యేక IT విభాగం ఏర్పాటు
🔹 కార్యదర్శుల ఖాళీలను 2025-26 ప్యానెల్‌కు ముందే భర్తీ చేయాలని నిర్ణయం

📜 ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జారీ చేశారు.