భారత్ న్యూస్ విజయవాడ…రోడ్డు ప్రమాదం జరిగితే కాంట్రాక్టర్‌కు జరిమానా.. జాతీయ రహదారులపై రక్షణ చర్యల బాధ్యత వారిదే
జాతీయ రహదారిపై నిర్దిష్ట అవధిలో ఒక ఏడాదిలో ఒకటి కన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగితే, ఆ రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్‌ను బాధ్యుడిని చేయాలని హైవేల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

ఉదాహరణకు 500 మీటర్ల ప్రాంతంలో, ఒక ఏడాదిలో ఒకటి కన్నా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగితే, ఆ రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్‌కు రూ.25 లక్షలు జరిమానా విధిస్తారు. మరో ఏడాది అదే ప్రాంతంలో ఒక ప్రమాదం జరిగితే, జరిమానా రూ.50 లక్షలకు పెరుగుతుంది. దీనికి అనుగుణంగా బీఓటీ అగ్రిమెంట్‌ను సవరించారు.